ముంబై ఇండియన్స్‌తో 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై
- ఫ్రాంచైజీతో తన బంధం ముగిసిందన్న రాబిన్ సింగ్
- 2010 నుంచి ఎంఐతో కొనసాగుతున్న మాజీ ఆల్‌రౌండర్
- ఐపీఎల్ జట్టుతో పాటు MI ఎమిరేట్స్ బాధ్యతల నుంచి కూడా ఔట్
- సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా ధ్రువీకరించిన రాబిన్ సింగ్
భారత మాజీ ఆల్ రౌండర్, ప్రముఖ కోచ్ రాబిన్ సింగ్.. ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీతో తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. 2010లో మొదలైన తమ 14 ఏళ్ల అనుబంధం ముగిసినట్లు ఆయన అధికారికంగా ప్రకటించాడు. ఐపీఎల్ జట్టుతో పాటు, ఐఎల్టీ20లోని ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ మేరకు 'X'లో ఒక పోస్ట్ చేసిన రాబిన్ సింగ్ "నేను ముంబై ఇండియన్స్‌తో అధికారికంగా విడిపోతున్నానని తెలియజేయాలనుకుంటున్నాను. 2022 నుంచి నేను వారి ఐపీఎల్ సిబ్బందిలో భాగం కానప్పటికీ, ఈ ఏడాది నుంచి ఎమిరేట్స్ లీగ్‌లోని వారి జట్టుతో కూడా నా ప్రయాణం ముగిసింది" అని స్పష్టం చేశాడు.
ఈ సందర్భంగా ఫ్రాంచైజీకి, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. "2010 నుంచి సాగిన ఈ అద్భుతమైన ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన మొత్తం ఎంఐ కుటుంబానికి, అభిమానులకు ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో ఫ్రాంచైజీకి శుభం కలగాలని కోరుకుంటున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నాడు.
రాబిన్ సింగ్ 2010 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి పనిచేస్తున్నాడు. జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లు గెలుచుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. 2023లో జరిగిన తొలి ఐఎల్టీ20 సీజన్లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు జనరల్ మేనేజర్‌గా, 2024లో హెడ్ కోచ్‌గా కూడా ఆయన వ్యవహరించాడు. ఆయన నిష్క్రమణతో ముంబై ఇండియన్స్ కోచింగ్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసినట్లయింది.